Home Page SliderNews AlertTelanganatelangana,

తెలంగాణ పోలీసులకు గుడ్‌న్యూస్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో సైనికుల్లా రాష్ట్రంలో పోలీసులు శాంతిభద్రతలు కాపాడుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా ఇస్తున్నామన్నారు. అలాంటి ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్ల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.