NationalNewsNews Alert

టీమిండియాకు గుడ్ న్యూస్-బుమ్రా రీఎంట్రీ

జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ పర్యటనలో మ్యాచ్ ఆడుతూ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆయన వరసగా జరిగిన వెస్టిండీస్ , జింబాబ్వే పర్యటనకి దూరంగా ఉండిన కారణంతో ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో బుమ్రాకి చోటు దక్కలేదు. దీంతో ఈ నెల 27 నుండి మెదలైతున్న ఆసియా కప్‌కి దూరంగా ఉండిపోగా , ఆక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఆడటం కూడా సందేహమని నిపుణులు భావించారు. కానీ బుమ్రా మాత్రం వాళ్ల సందేహాలను కొట్టి పడేసే విధంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బుమ్రా చాలా ఫిట్‌గా కనిపించడంతో పాటు హార్డిల్స్ కూడా చేస్తూ కనిపించారు.

వెన్నుకు గాయం కావడంతో దానికి సంబంధించిన చికిత్స కోసం బెంగుళూరుకు వెళ్లిన బుమ్రా చాలా కొద్ది సమయంలోనే అతని ఫిజియోతో కలిసి హార్డిల్స్ చేయండం చూసి అందరు షాక్‌కు అయ్యారు. అతని జోష్‌ చూస్తుంటే సెప్టెంబరులోనే భారత జట్టులోకి  రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు ఉన్నాయని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.