Home Page SliderNews AlertTelangana

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..

తెలంగాణలోని ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఏడాదికి రూ.3,500, హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు రూ.7,000 ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ నేరుగా విద్యార్థుల ఖాతాలో కానీ, తల్లిదండ్రుల ఖాతాలో కానీ జమ కానుందని తెలియజేసింది. అలాగే మురికివాడలలో నివసించే కార్మికుల పిల్లలకు 1 నుండి 10వ తరగతి వరకూ ఏడాదికి రూ. 3,500, హాస్టళ్లలో ఉండేవారికి 3 నుండి 10 వ తరగతి వరకూ ఏడాదికి రూ.8,000 చెల్లిస్తామని పేర్కొంది. ఈ స్కాలర్ షిప్పుల కోసం ఈ పాస్ సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది.