సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ నుండి, ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 8 నుండి 13 వరకూ హైదరాబాద్, బెంగళూరు నుండి విజయవాడ నుండి నడుపుతున్నారు. అలాగే తిరుగు ప్రయాణానికి కూడా జనవరి 16 నుండి 20 వరకూ బస్సులు నడుపుతున్నారు. అలాగే ఈ బస్సులలో ఒకేసారి రానూ పోనూ టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ముందస్తు బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులనే ఉపయోగించాలని పేర్కొన్నారు.