Andhra PradeshHome Page SliderNews Alert

పిఠాపురం వాసులకు శుభవార్త

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురం ప్రజలకు శుభవార్త చెప్పారు. అక్కడ గల 30 పడకల ఆసుపత్రిని 100 బెడ్‌లు కల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం రూ.38 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ 66 పోస్టులు త్వరలోనే సర్కారు భర్తీ చేస్తుందని, వారి జీతాల కోసం రూ.4.32 కోట్లు వెచ్చిస్తుందని జనసేన పార్టీ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది.