పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు శుభవార్త
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ చదివి సకాలంలో బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోలేని విద్యార్థులు మరోసారి పరీక్ష రాసుకోవచ్చు. ఆగస్టు 16వ తేదీ వరకు వన్ టైమ్ చాన్స్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువిచ్చారు. రూ.500 జరిమానాతో ఆగస్టు 28 వరకు ఫీజు చెల్లించవచ్చు. వన్ టైమ్ చాన్స్ రుసుము, పరీక్ష ఫీజుతోపాటు గతంలో హాల్ టిక్కెట్, మార్కుల మెమోల కాపీలను జతపర్చాలని విద్యార్థులకు సూచించారు.