ఏపీలో ఫించన్‌దారులకు గుడ్‌న్యూస్
ఏపీలో ఫించన్ దారులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అదేంటంటే రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను రూ.2750 నుంచి రూ.3000/-లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పెరిగిన పెన్షన్లను జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. కాగా ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పెన్షన్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల వ్యవధిలోనే పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీలోని పెన్షన్ లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.