ఆన్‌లైన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్… సేల్‌లో 75 శాతం డిస్కౌంట్
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులకు అమెజాన్ శుభవార్త తెలిపింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఈసారి స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం.. స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు లాంటి వస్తువలపై 75 శాతం వరకు డిస్కౌంట్ అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19, 2023 నుండి ప్రారంభమై.. జనవరి 22, 2023న ముగుస్తుంది. అంటే 4 రోజుల పాటు ఈ డీల్ కొనసాగనుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు జనవరి 18 నుండి అంటే ఒక రోజు ముందు నుంచే ఈ ఆఫర్స్‌ను యాక్సెస్ చేయబడతాయని తెలిపింది. Oppo, Xiaomi, OnePlus, Samsung, Apple, Vivo లాంటి బ్రాండ్‌లపై భారీగా డిస్కౌంట్ తగ్గనుంది. డిస్కౌంట్లతోపాటు క్యాష్ బ్యాక్‌లను అందించనుంది. దానికితోడుగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఈ ఆఫర్ వర్తించనుందని ఈ కామర్స్ సంస్థ వెల్లడించింది.