మాంసాహార ప్రియులకు గుడ్‌న్యూస్…
మాంసాహార ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజుల నుండి చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు 220 నుంచి 160 రూపాయల మేర తగ్గాయి. కొంత మంది రిటైల్ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాయిలర్ కోడి లైవ్ ధర 90కి పడిపోయింది. మరోవైపు… కోడిగుడ్డు ధరలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో 555 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం 440 రూపాయలు ఉంది. కోళ్ల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు, లేబర్ ఛార్జీలు పెరిగిపోయాయి. చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. ప్రభుత్వం చికెన్ వ్యాపారులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.