ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త..
ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించాలని కలలు కనే యువతకు శుభవార్త చెప్పింది కేంద్రం. దేశవ్యాప్తంగా రాబోయే ఆరు నెలల కాలంలో ఐటీ ఉద్యోగాలు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించింది. ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త కొత్త టెక్నాలజీలతో ఐటీ రంగం సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతోందని, దానికి తగినట్లు మార్కెట్లో ఐటీ నిపుణులకు ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. 2030 నాటికి 10 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన జరగనుందని అంచనాలు వేస్తున్నారు. ప్రాంతాల వారీగా బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత హైదరాబాద్ ఉండడం గమనార్హం. ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి విభాగాలలో సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉందని పేర్కొంటున్నారు.

