Home Page SliderNationalNews Alert

ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త… చరిత్రలో తొలిసారిగా కొత్త ప్యాకేజీ…

2023-24 బడ్జెట్‌లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎం ఆవాస్‌ యోజన స్కీంలో ఈ సారి బడ్జెట్‌లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి 79 వేల కోట్లు కేటాయించారు.  మొట్ట మొదటిసారిగా భారత దేశ బడ్జెట్‌లో కొత్త ప్యాకేజీని కేంద్రం పరిచయం చేసింది. పీఎం విశ్వ కర్మ కౌశల్‌ సమ్మాన్‌ పేరుతో ఆ ప్యాకేజీని తీసుకురాబోతున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎంఎస్‌ఎంసీ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ) వాల్యూ చెయిన్‌తో అనుసంధానం చేయడం ద్వారా… వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం, క్షేత్రస్థాయిలో అవి వెళ్లే పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమవుతుందన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ ప్రవేశపెట్టామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.