యూపీలో బంగారు గణపతి
దేశమంతా ఉత్సవాలకు సిద్దమైంది. హిందువులు అత్యంత సంతోషకరంగా, ఎంతో సందడిగా, చేసుకునే పవిత్రమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వినాయక చవితి వేడుకలు భక్తి, శ్రద్ధతో చాలా వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి నిర్వహించనున్నారు.భారతదేశంలో చాలా మంది హిందువులు తమ ఇళ్లలోకి వినాయక విగ్రహాన్ని పెట్టుకుని, పూజలు చేస్తారు. నిర్ణీత రోజుల తర్వాత వాటిని నిమజ్జనం చేస్తారు. ఇక సామూహికంగా పెట్టే వినాయక విగ్రహాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది.కొందరు తమ సృజనత్మకతను ఉపయోగించి, రకరకాలుగా వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. ఆ వినాయక విగ్రహాలు ఆకర్షణీయమైన రూపాలలో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో యూపీలోని చందౌసీలో పెట్టనున్న వినాయక విగ్రహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

వినాయక విగ్రహం ఎంత వైవిధ్యంగా ఉంటుందో ప్రజలను అంతగా ఆకట్టుకుంటుంది. కొంత మంది దానిని నాణేలతో అలంకరిస్తారు..ఇంకొందరు కరెన్సీ నోట్లతో అలంకరిస్తారు. మరికొందరు కూరగాయలతో వినాయకుడిని తయారు చేస్తారు. అయితే యూపీలోని చందౌసీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు బంగారు గణపతి సిద్ధం చెయడం ఆసక్తికరంగా మారింది. 18 అడుగుల ఎత్తు విగ్రహనికి మొత్తం బంగారుతో వివిధ రకాల అకృతులను తాపడంగా చేస్తు్న్నట్లు చెప్పారు. అజయ్ ఆర్యా అనే నిర్వాహకుడు మాట్లాడుతూ, విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుందన్నారు. దీనికి తిరుపతి బాలాజీ తరహాలో బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నట్లు వివరించారు.

