Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

బంగారం దొంగ అరెస్ట్‌

రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్న పాలెం గ్రామంలో ఈ నెల 7న‌ చల్లా అంజమ్మ ఇంట్లో జ‌రిగిన బంగారం చోరీ కేసులో నిందితుణ్ని ప‌ల్నాడు పోలీసులు సోమ‌వారం అరెస్ట్ చేశారు. సుమారు పదమూడు లక్షల విలువ చేసే 14 శ‌వర్ల బంగార ఆభ‌ర‌ణాలు,ముప్పై వేల‌ నగదును చోరీ చేశాడు.ఈ దొంగ‌త‌నానికి పాల్ప‌డింది… అదే గ్రామానికి చెందిన వల్లెపు విష్ణు వర్ధన్( 22) గా గుర్తించి యువకుడుని అరెస్ట్ చేశారు.ఈ మేర‌కు నరసరావుపేట డిఎస్పీ కార్యాలయంలో సంబంధిత‌ వివరాలను నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు వెల్ల‌డించారు.