Home Page SliderNational

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. దీంతో ఈ ప్రభావం బంగారంపై పడి రోజు రోజుకి బంగారం ధరలు ఆకాశనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి బంగారం ధరలు పెరిగాయి. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ.54,250 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరగడంతో రూ.59,180కి చేరింది. మరోవైపు వెండి ధర కేజీకి రూ.500 వరకు పెరిగింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.74,500 పలుకుతోంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.