దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా ఉన్న బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. అదేంటంటే మొన్నటి వరకు ఆకాశన్నంటిన బంగారం ధరలు ఇవాళ కొంతమేర తగ్గాయి. దీంతో ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.58,960కి చేరింది. కాగా 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.54,050గా ఉంది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.75,700గా ఉంది.

