దిగొచ్చిన బంగారం ధరలు..
బంగారు ప్రియులను కొన్ని నెలలుగా ధరలు కంగారు పెట్టిస్తున్నాయి. చుక్కలనంటుతున్న ధరతో బంగారం లక్ష రూపాయల మార్క్‌ను కూడా దాటి పోయింది. అయితే నేడు ఒక్క రోజులోనే బంగారం ధరలు ఏకంగా రూ.3 వేల మేర దిగొచ్చాయి. నిన్న రూ.1,02,000 పైగానే ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.99 వేలకు చేరింది. 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.2,750 తగ్గి, రూ.90,200లకు చేరింది. వెండి ధర కిలోకి రూ.1,11,000 ఉంది. అక్షయ తృతీయ సమీపిస్తుండడంతో పసిడి ప్రియులు ఈ వార్త విని సంబరపడుతున్నారు.

