కుంభమేళాకు వెళ్లొస్తూ…అనంతలోకాలకు
మహాకుంభమేళాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న ఓ మినీ లారీని మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది.దీంతో ఈ ప్రమాదంలో 7గురు వ్యక్తులు స్పాట్‌లో మృత్యువాతపడ్డారు,మరి కొంత మంది పరిస్థితి విషమంగా మారింది.వీరంతా తెలుగు వారు కావడం గమనార్హం. తెలిసిన వివరాల మేరకు…మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30పై మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా వద్ద కుంభమేళా యాత్రీకులున్న మినీ బస్సును… ఓ లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. రెండు వాహనాలు బ్రిడ్జి సెయిలింట్ పై ఢీకొనడంతో ప్రయాణీకులు తప్పించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.దీంతో 7గురు అక్కడికక్కడే చనిపోయారు.స్థానికుల సహాకారంతో కొంత మందిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.