పెళ్లి బట్టల్లోనే పరీక్ష కేంద్రానికి..
పెళ్లి బట్టలు.. నెత్తిపై జీలకర్ర బెల్లం.. కాళ్లకు పారాణి.. ఇలా పెళ్లి మండపంలో ఉండాల్సిన ఓ నూతన వధువు పరీక్ష కేంద్రంలో దర్శనమిచ్చింది. అక్కడున్న వారంతా ఆమెను చూసి షాకయ్యారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతిలో జరిగింది. ఈ గ్రూప్ 2 పరీక్ష రాయటానికి ఆ నూతన వధువు అప్లై చేసుకుంది. అయితే.. గ్రూప్ 2 పరీక్ష రోజే మమతా పెళ్లి నిశ్చయమైంది. చిత్తూరులో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వధువు మమత పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం సరిగ్గా ఎగ్జామ్ సమయానికి తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ వద్ద సెంటర్ లో పరీక్ష రాయడానికి హాజరైంది. ఆమె పెళ్లి బట్టలోనే మమతా ఎగ్జామ్ సెంటర్ కు రావడంతో అక్కడున్న వారిని ఆకట్టుకుంది. అటు పెళ్లి.. ఇటు పరీక్ష రెండింటిని ఒకేరోజు మ్యానేజ్ చేయడంతో మమతను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

