స్వామి దర్శనానికి వెళ్లివస్తూ తిరిగిరాని లోకాలకు..!
హైద్రాబాద్-వరంగల్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. హైద్రాబాద్ చంపాపేట్ కు చెందిన బైగళ్ల జగన్ అనే వ్యక్తి తన భార్య పావని(30) కుమారుడు ప్రణయ్,కుమార్తె సాత్వికతో కలిసి బైక్ పై శ్రీయాదగిరి లక్ష్మీనరసింహుని క్షేత్రమైన యాదగిరిగుట్టకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరగు ప్రయాణమయ్యారు. భువనగిరి మండల పరిధిలోని దీప్తి హోటల్ కి సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీట్టింది.దీంతో భార్య పావని స్పాట్లోనే చనిపోయింది.కుమారుడు ప్రణయ్‌ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.కూతురు సాత్విక,తండ్రి జగన్ ఇద్దరూ స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.జగన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.