త్వరలో అఖండ గోదావరి ప్రాజెక్ట్…మంత్రి
రాజమండ్రి: అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 26 కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరి పాల్గొంటారని చెప్పారు. రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. రాజమండ్రి హేవ్ లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే పుష్కర ఘాట్లను, కడియం నర్సరీలను అభివృద్ధి చేస్తామన్నారు.