News AlertTelangana

గర్ల్ హాస్టల్‌లోకి వెళ్లి డ్యాన్స్

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రవర్తనపై ఆందోళన నెలకొంది. యూనివర్సిటిలోని గణేష్ నిమజ్జనం పూర్తి అయిన తర్వాత మరో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి గర్ల్స్ హాస్టల్‌లోకి డ్యాన్స్‌లు చేశారు. అంతే కాకుండా డాన్స్ చేస్తూ డబ్బులు పంచారు. డాన్స్ చేస్తూన్న విద్యార్థినుల వైపుగా వీరు వెళ్లడంతో వారు ఆశ్చర్యపోయారు. అసలు గర్ల్స హాస్టల్‌లోకి వచ్చి డ్యాన్స్‌లు వేస్తూ , డబ్బులు పంచడం ఏంటి? అని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.