Home Page SliderNational

జ్ఞానవాపి అసలు మసీదే కాదు…యోగి ఆదిత్యనాథ్

వారణాశిలోని విశ్వేశ్వరుని దేవాలయానికి ఆనుకొని ఉన్న జ్ఞానవాపి మసీదు, అసలు మసీదే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు యూపీ సీఎం ఆదిత్యనాథ్. ఈ మసీదులో బావి ఉందని దానిలో శివలింగం ఉందని, గుర్తులు ఉన్నాయన్నారు. మసీదు గోడలపై కూడా హిందూ మతానికి చెందిన గుర్తులున్నాయన్నారు. అక్కడ పరమశివుని త్రిశూలం, గోడలపై దేవతల విగ్రహాలు ఉన్నాయన్నారు. ఇది ఒక చారిత్రక తప్పిదంగా దేవాలయంపై ముస్లింలు మసీదు నిర్మాణం చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ ఎంపీ అసరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లింలను ఎందుకు బెదిరిస్తున్నారని,  ఈ మసీదు 400 ఏళ్లగా అక్కడ ఉందనే విషయాన్ని మరిచిపోకూడదని అన్నారు. మీరు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఈ కేసు అలహాబాద్ కోర్టులో ఉందని, దీనిపై ఎలా వ్యాఖ్యానిస్తారని మండిపడ్డారు.