‘ది రాజా సాబ్’ గ్లింప్స్ రివీల్ చేస్తున్నారా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేయడంతో అభిమానులతో పాటు యావత్ సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌కి సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘ది రాజా సాబ్’ గ్లింప్స్‌లో ప్రభాస్ ‘డార్లింగ్’ తరహా లుక్స్‌లో కనిపిస్తాడని, అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ‘ది రాజా సాబ్’ రిలీజ్‌పై సాలిడ్‌గా కన్ఫర్మేషన్ రానుండడంతో సమ్మర్ 2025 లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దీంతో అభిమానుల్లో ‘ది రాజా సాబ్’ గ్లింప్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. దర్శకుడు మారుతి ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనింగ్ కథగా రూపొందించాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.