Breaking NewscrimeHome Page SlidermoviesTelangana

సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాన‌ని లైంగిక దాడి

సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ అని నమ్మించి ఓ మహిళకు దగ్గరైన కాటేకొండ రాజు అనే వ్య‌క్తిని జూబిలీ హిల్స్ పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. ఆడిషన్స్ పేరుతో హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసిన‌ట్లు స‌ద‌రు మ‌హిళ, పోలీసుల‌కు తెలిపింది. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఈ మేర‌కు ఫిర్యాదు న‌మోదైంది.దీనిపై జూబిలీ హిల్స్ పోలీసులు మాట్లాడుతూ…సినిమాల‌తో సంబంధం లేని వ్య‌క్తి ఓ మ‌హిళ‌ను దురుద్దేశ్య‌పూర్వ‌కంగా న‌మ్మించి వంచించిన‌ట్లు త‌మ‌ ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలింద‌న్నారు.నిందితుణ్ని అరెస్ట్ చేసి ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు.