GHMC కౌన్సిల్ సమావేశం రసాభాస
టిజి: GHMC కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో 15 నిమిషాల పాటు సభను మేయర్ వాయిదా వేశారు.