Home Page SliderTelangana

‘పుష్ప’కు నేషనల్ అవార్డు రావడం డబుల్ అఛీవ్‌మెంట్…అల్లు అర్జున్

పక్కా కమర్షియల్ చిత్రమైన పుష్పకు నేషనల్ అవార్డు రావడం డబుల్ అఛీవ్‌మెంట్ అని, చాలా ఆనందంగా ఉందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  సంతోషపడ్డారు. ఢిల్లీలోని 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. పుష్ప చిత్రానికి  జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు. అవార్డు స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని, తగ్గేదే లేదని డైలాగ్ చెప్పారు. తెలుగు చిత్రాలు ఈ సారి ముందు వరుసలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు రవిశంకర్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, RRR దర్శకుడు రాజమౌళి జాతీయ అవార్డులు స్వీకరించనున్నారు. చిన్న సినిమాగా రిలీజై వందల కోట్లు కలెక్షన్ సాధించిన  హిందీ చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ రెండు పురస్కారాలు గెలుచుకుంది. RRR చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి. కొండపొలం చిత్రంలోని ‘ధమ్ ధమ్’ అనే పాటకు గీత రచయిత చంద్రబోస్‌కు జాతీయ పురస్కారం లభించింది. ఆగస్టులో ప్రకటించిన ఈ అవార్డులలో అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమ నుండి తొలిసారి జాతీయ అవార్డు పొందిన నటుడిగా నిలిచారు.