ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీ కాదు..
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇకపై అంత ఈజీ కాదు. వాహన డ్రైవింగ్ పరీక్షను కఠినతరం చేయడానికి రవాణా శాఖ సిద్దమవుతోంది. ఈ కొత్త విధానంలో ఖాళీ మైదానంలో కారు నడపడమే కాదు, ట్రాక్‌తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని కూడా ప్రత్యేక సిమ్యులేటర్‌పై పరీక్షిస్తారు. మైదానంలో టెస్ట్ ట్రాక్‌తో పాటు ఈ పరీక్ష కూడా పాస్ కావలసి ఉంటుంది. వీడియో గేమ్ వంటి స్క్రీన్‌పై రోడ్డు, ఇతర వాహనాలు వెళుతుండగా కారులో స్టీరింగ్, క్లచ్, బ్రేక్, గేర్లు అన్నీ ఉపయోగిస్తూ వాహనాన్ని నడపవలసి ఉంటుంది. ఆ రోడ్డుపై వర్షం, చీకటి, పొగమంచు, ఎండ వంటి పరిస్థితులలో కూడా మీరెలా డ్రైవింగ్ చేస్తున్నారో పరీక్షిస్తారు. అంతేకాదు వాహనం వేగం, డ్రైవర్ ముఖకవళికలు, ఒత్తిడి కూడా పరీక్షిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 18 కార్యాలయాలలో మొదటగా ఈ సిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది.

