గెట్ రెడీ ఫర్ “BRO” ప్రీరిలీజ్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “BRO” సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రేపే “BRO” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకగా జరగనుంది. ఈ వేడుకకు హైజరాబాద్‌లోని శిల్పకళా వేదిక ముస్తాబవుతోంది. కాగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అయితే “BRO” సినిమాని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన “మై డియర్ మార్కండేయ” సాంగ్ కూడా సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది. ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.