Andhra PradeshHome Page Slider

ఏపీలో మెగా డీఎస్సీపై గెజిట్ విడుదల

ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సచివాలయంలో సీఎంగా తన బాధ్యతలను స్వీకరించారు.అయితే సీఎంగా చంద్రబాబు మెగా డీఎస్సీపై తన తొలి సంతకాన్ని చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ మెగా డీఎస్సీ గెజిట్ విడుదలైంది. కాగా మెగా డీఎస్సీ 2024ను నిర్వహించాలని విద్యాశాఖ కమీషనర్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఏపీలో త్వరలోనే 16,347 పోస్టులకు డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడనుంది. కాగా ఈ డీఎస్సీ పోస్టులను డిసెంబర్ 31 నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపట్ల ఏపీలోని డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.