డ్రైనేజ్ నుండి గ్యాస్ లీక్.. 12 మంది అస్వస్థత
జైపూర్‌లోని ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్ వద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. డ్రైనేజ్ నుండి గ్యాస్ లీక్ అయి, 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరూ ఐసీయూలో ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో క్లాస్ రూమ్‌లో 20 మంది విద్యార్థులు ఉన్నారని, గ్యాస్ లీక్ ఘటనలో అందరూ స్పృహ తప్పి పడిపోయారని పేర్కొన్నారు. ఈ ఘటన రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది. దీనితో అక్కడ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. కోచింగ్ సెంటర్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జైపూర్‌లో ఈ మధ్య కాలంలో కోచింగ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. జైపూర్ ఇలాంటి క్లాసులకు హబ్‌గా మారిందని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలోని బేస్‌మెంట్‌లో కోచింగ్ క్లాసులు జరుగుతున్న సమయంలో డ్రైనేజ్ నీరు, వరద నీరు కలిసి ముంచెత్తడంతో జరిగిన ప్రమాదం సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

