ఆప్కో ఛైర్మన్‌గా గంజి చిరంజీవి ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం (ఆప్కో) చైర్మన్ గా మంగళగిరి మునిసిపాలిటీ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులైన చిరంజీవి వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆప్కో చైర్మన్‌గా చిరంజీవిని నియమించడం పట్ల చేనేత వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి చేనేత కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ పిలుపు ఇచ్చింది.
