బాలికపై సామూహిక లైంగిక దాడి
హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో ఐదుగురు వ్యక్తులు… బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంటికి వెళ్తున్న బాలికను వెంబడించి వాహనంలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.తర్వాత బాలికను వేరే ప్రాంతంలో వదిలి వెళ్లారు. ఇంటికి చేరుకుని జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది.దీంతో బాలికను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువకులను అదుపులోకి తీసుకొని పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.