విశాఖ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్
న్యాయసాయం చేసి నలుగురికి మేలు చేయాలన్న లక్ష్యంతో న్యాయవిద్యనభ్యసిస్తున్న ఓ యువతికి….నాకు న్యాయం చేయండి మహా ప్రభో అని దీనస్థితికి చేరుకునేలా చేశారు నలుగురు కామాత్ములు. ఫ్రెండ్ షిప్ పేరుతో నమ్మించి, ప్రేమ పేరుతో నయవంచనకు పాల్పడ్డాడు ఓ మృగాడు . తెలిసిన వివరాల ప్రకారం …విశాఖలోని మధుర వాడలో ధర్డ్ ఇయర్ లా చదువుతున్న యువతికి తన సహచర విద్యార్థి వంశీతో పరిచయం ఏర్పడింది. ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఈ ఏడాది ఆగస్ట్ 10న విశాఖలోని కంబాలకొండకు ఆ యువతిని తీసుకెళ్లాడు. ఆ యువతి వద్దని వారిస్తున్నా…కొండ మీదకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతే కాదు…తన రూమ్ మేట్స్ ఉంటున్న రూంకి కూడా తీసుకెళ్లి పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతో నమ్మి వచ్చిన యువతిని తన ఫ్రెండ్స్ కి కూడా దాహం తీర్చే నీటి కుండలా మార్చి క్రూర మృగంగా మారిపోయాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఆమెపై అత్యాచారం చేసేలా ప్రోత్సహించాడు.దీంతో యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.మళ్లీ కొంత కాలం గడిచాక…ఆ నలుగురు మృగాళ్లు తమ కోర్కె తీర్చమని వెంటబడ్డారు.నిత్యం ఫోన్ లు చేసి బెదిరించసాగారు.లేకపోతే …గతంలో నగ్నంగా తీసిన వీడియోలను వెబ్ సైట్ లో పెడతామని బెదిరించారు.దీంతో గత్యంతరం లేక ఫ్యాన్ కి ఉరేసుకుని బలవన్మరణానికి యత్నించింది.దీంతో గమనించిన తల్లిదండ్రులు….అతి కష్టం మీద రక్షించారు.జరిగిన విషయం అంతా తల్లిదండ్రులకు వివరించింది.ఈ నేపథ్యంలో నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు.

