గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్
అల్లూరి జిల్లా జి.మాడుగులలో దారుణం చోటు చేసుకుంది. జి.మాడుగులలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలిక గత కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఆ మేరకు విద్యార్ధిని తల్లిదండ్రులు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ముగ్గురు యువకులు …బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.గత మూడు రోజులుగా బాలికపై వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బాలిక ఉన్న లొకేషన్ ని ట్రేస్ ఔట్ చేశారు.ఆ ముగ్గురు యువకుల వద్దే బాలిక ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.