మైలార్ దేవ్‌పల్లిలో దొంగల ముఠా హల్ చల్
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లిలో దొంగల ముఠా హల్ చల్ చేసింది. రాఘవేంద్ర కాలనీకి చెందిన జితేందర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారుతో ఢీ కొట్టారు. అతని వద్ద నుంచి 20 లక్షలు ఉన్న బ్యాగును లాకెళ్లి అక్కడి నుంచి కారులో ముగ్గురు దొంగలు ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. దుండగులు రాజస్థాన్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద 18 లక్షల నగదు రికవరీ చేశారు. ఎక్స్ యువీ వాహనం సీజ్ చేశారు.

