Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

గంజాయి విక్రేత ముఠా అరెస్ట్‌

గంజాయిని పెద్ద మొత్తంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న అంత‌రాష్ట్ర ముఠా స‌భ్యుల‌ను తిరుప‌తి రూర‌ల్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి 25 కేజిల ముడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంధీపురం పంచాయతీ ప‌రిధిలోని ధనలక్ష్మి నగర్ కు చెందిన చాంద్ బి, మల్లం గుంట పంచాయతీ ప‌రిధిలోని వినాయక నగర్ కి చెందిన సాయి, ములకలచెరువు మండలం బురకాయల కోటకు చెందిన రసూల్ బీ అనే వ్య‌క్తులు గంజాయిని కొనుగోలు చేసి ఎండ‌బెట్టి వాటిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసి వేలాది రూపాల చొప్పున ఒక్కో ప్యాకెట్ విక్రయిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. సమాచారం మేర‌కు ముగ్గురుని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా న్యాయ‌మూర్తి రిమాండ్ విధించిన‌ట్లు సీఐ చిన్న‌గోవిందు తెలిపారు.