Home Page SliderTelangana

పోలీసులకు చిక్కిన మహిళ దొంగల ముఠా

రద్దీగా ఉండే ప్రదే శాలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠాను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ రాజేశ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న భువనగిరి బస్టాండులో ఒక ప్రయాణికురాలి బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మహిళ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఈ మేరకు నిన్న మధ్యాహ్నం భువనగిరి బస్టాండు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా రామవరపుపాడుకు చెందిన గన్నికోట దుర్గ, నక్క మంగ, వెస్ట్ గోదావరి జిల్లా చింతలకోటిగరువుకు చెందిన గండికోట లక్ష్మిలుగా గుర్తించారు. విచారణ చేయడంతో నేరాలను ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.3.40 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.