Andhra PradeshcrimeHome Page Slidermovies

గేమ్ ఛేంజర్ దొంగలు దొరికారు

ఇటీవల విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ చిత్రం గేమ్ ఛేంజర్ పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. విడుదలైన తర్వాతి రోజే హెచ్‌డీ క్లారిటీతో పైరసీ కాపీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఏపీలోని ఒక టీవీ ఛానల్ ఈ చిత్రాన్ని కేబుల్ టీవీలో ప్రసారం చేసింది కూడా. దీనితో మూవీ టీం గాజువాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు, సైబర్ క్లూస్ టీమ్ సహాయంతో ఆ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు.