గజ్వేల్: వర్గల్-నెంటూర్ ఎన్నికల ప్రచారంలో: ఈటల
గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం నెంటూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్. బీజేపీ ర్యాలీకి పోవద్దు అని బెదిరిస్తున్న చరిత్ర గజ్వేల్‌లో కనిపిస్తోంది. పైసలే ఊకే నడుస్తాయా?
మనం అంగట్లో సరుకా.. మనం మనుషులం. ఇళ్ళు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వానికి ఓటు వేద్దామా? నెంటూర్‌లో కూడా ప్రభుత్వం ఇచ్చిన భూములు గుంజుకుంటున్నారు. రైతుని భూమి నుండి వేరుచేస్తున్నారు. మల్లన్నసాగర్‌లో 9 ఊర్లు మునిగిపోతే ఆ రైతులు కూలీలుగా మారారు. కేసీఆర్‌కి ఓటు వేసిన పాపానికి 30 వేల కుటుంబాలను రోడ్డున పడవేశారు. కేసీఆర్ ప్రజలను వేధిస్తున్నారు. భూమి గుంజుకోవడానికి నువ్వు ఇచ్చావా? ల్యాండ్ బ్రోకర్‌వా కేసీఆర్ నువ్వు. వైద్య విద్య ఉచితంగా అందాలంటే.. ముసలివాళ్లిద్దరికీ పెన్షన్ రావాలంటే.. డబుల్ బెడ్ రూమ్ రావాలంటే.. కొత్త రేషన్ కార్దు కోసం.. బ్రతుకు బాగుకోసం.. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి..