గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఎన్నికల సంఘంతోపాటు, ప్రతివాదికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డీకే అరుణ హైకోర్టును తప్పుదోవ పట్టించారని పిటిషనర్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

