దాతృత్వం చాటుకున్న కేసిఆర్
అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకుడికి బీ.ఆర్.ఎస్.అధినేత,మాజీ సీఎం కేసిఆర్ అక్షరాల రూ.10 లక్షల ఆర్ధిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.పార్టీ పట్ల చిత్తశుద్దితో ,అంకిత భావంతో పనిచేసిన డోకుపర్తి సుబ్బారావు అనే కార్యకర్త గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో బాధితుణ్ణి ఇంటికి పిలిచి రూ.10లక్షల నగదు చెక్కుని అందజేశారు.బాధితుడు తన కుటుంబీకులతో కేసిఆర్ ని కలిశాడు.కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి వ్యక్తులకు కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీ అండగా ఉంటుందని కేసిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.