ఆ రెండు దేశాల యుద్ధానికి ఫుల్‌స్టాప్
గత 15 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు ఓకే చెప్పిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించింది. మరోపక్క హమాస్ అధీనంలో ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడంతో ఈ కథ ముగిసింది.
ఈజిప్ట్, ఖతర్, ఇజ్రాయెల్‌తో కలిసి కొన్ని నెలలపాటు జరిపిన దౌత్యం అనంతరం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. 15 నెలలపాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారు ఈ ఒప్పందంతో విడుదల కానున్నారు. తొలుత ఆరు వారాలపాటు కుదిరిన ఒప్పందం ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుంది.
ఇరు దేశాల మధ్య జరిగిన ఈ శాంతి ఒప్పందంలో బైడెన్ కీలకంగా వ్యవహరించడంతో ఈ యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికారు.


 
							 
							