Andhra PradeshHome Page Slider

ఇకపై ఆ నాలుగు ఆదివారాలు బడికి రావాల్సిందే..!

 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే చోట ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా నాలుగు సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ముందుగా ఓ 6 రోజుల సెలవు దినాల్లో తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసి..వీటిని తగ్గించాలని విద్యాశాఖ అధికారులను విజ్ఞప్తి చేశాయి. కాగా వీరి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ అధికారులు ఈ నెల 30 లోపు నాలుగు ఆదివారాలల్లో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.