తెలంగాణలో ఇక నుంచి రాజుగారి చేపలు కనిపించవు
అవును ఇక నుంచి తెలంగాణా వ్యాప్తంగా రాజుగారి చేపలు కనిపించని పరిస్థితి ఉండబోతుంది.సంక్రాంతికి ముందు నుంచే రాజుగారి చేపలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం బుధవారం ప్రకటించింది.ఇంతకీ రాజుగారి చేపలేంటి..ఆ కథేంటి అనుకుంటున్నారా.అదేనండి కింగ్ ఫిషర్(రాజు గారి చేప) బీర్లు గురువారం నుంచి సరఫరా చేయబోమని కింగ్‌ఫిషర్ బీర్‌ను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు తేల్చి చెప్పింది.ఇప్పటికే సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.దీంతో రాజుగారి చేపలను అభిమానించే మందు బాబులు గగ్గోలు పెడుతున్నారు.పండగ ముందు ఈ నిర్ణయం ఏంట్రా స్వామీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే…మరికొంత మంది మాత్రం ఇది సీఎం రేవంత్ నిర్ణయమని వాళ్ల సొంత కంపెనీ బీర్లను ప్రమోట్ చేసుకుని భారీ ఎత్తున విక్రయించుకుని లాభ పడేందుకే ఇలా చేశారని విమర్శిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ కొంత కాలం తెలంగాణలో రాజుగారి చేపలు మాత్రం కనిపించవు.