Home Page SliderTelanganatelangana,

ఇకపై ఈజీగా బెంగళూరుకు..ఆరాంఘర్ వంతెన ప్రారంభం

హైదరాబాద్ నుండి బెంగళూరు హైవేకు  వెళ్లాలంటే ఆరాంఘర్ వరకూ చాలా రద్దీని ఎదుర్కోవలసి వస్తుంది.  గంటల తరబడు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా కొత్తగా ఆరాంఘర్- జూపార్క్ వంతెన ప్రారంభమయ్యింది.  రూ. 800 కోట్లతో బల్దియా నిర్మించిన వంతెనను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ వంతెన 4.08 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్ నగరంలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండవ అతిపెద్ద వంతెనగా దీనిని చెప్పవచ్చు. ఈ వంతెనను గత డిసెంబర్‌లోనే ప్రారంభించాల్సి ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది.