ఫ్రెండ్స్ అనేవారు డైట్ కంట్రోల్ అంతలాగా, ఏమౌతుంది నీ ఆరోగ్యం..
దేశవ్యాప్తంగా అలియాభట్‌కు ఉన్న ఫేన్ ఫాలోయింగ్ ఏమిటో మీకు తెలుసా. నేటి యువతరానికి అభిమాన నాయికగా పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించింది అలియా. ఆమె ఇమేజ్ జయాపజయాలకు అతీతం. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది అలియా. ‘నేను చిన్నప్పట్నుంచి కాస్త లావుగా ఉండేదాన్ని. నా లుక్ గురించి నేనెప్పుడూ ఫీలవ్వలేదు కూడా. కానీ హీరోయిన్‌గా సినిమాలకు రావాలని అనుకున్నప్పుడు మాత్రం నన్ను నేను తప్పకుండా మార్చుకోవాల్సి వచ్చింది.
దానికోసం నేను చాలా కష్టపడ్డా. సరిగ్గా తిండి తినేదాన్ని కాదు, జిమ్‌లో గంటల తరబడి ఎక్సైజ్ చేసేదాన్ని. నా డైట్ కంట్రోల్ చూసి నా ఫ్రెండ్స్ అంతా ఏమి అంత తక్కువగా తింటున్నావు అని భయపడేవాళ్లు. డైటింగ్ ఆపేయ్.. నచ్చింది తిను. ఎందుకు అంత కష్టపడతావు, ప్రశాంతంగా ఉండు. ఎందుకీ టెన్షన్, ఆ కడుపు మాడ్చుకోవడం ఆ అవస్థ.. అంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించేవారు. నేను మాత్రం వారి మాటల్ని అస్సలు ఖాతరు చేసేదాన్ని కాదు. బరువు తగ్గాక అప్పుడు మాత్రం అందులో ఉండే ఆనందం ఏంటో అర్థమైంది. ఇక బరువు విషయంలో కంట్రోల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా అని గుర్తుకు తెచ్చుకుంది ఆ పాత రోజుల్ని హీరోయిన్ అలియా భట్.