Home Page SliderTelangana

ఫ్రీ జర్నీ మహిళలకు వరం, ఆటో డ్రైవర్ల పాలిట శాపం

హైదరాబాద్: బస్సు భవన్ ముట్టడికి మంగళవారం ఉదయం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆటో కార్మికులు యత్నించారు. పలుడిమాండ్ల సాధనతో నిరసన ప్రదర్శన చేపట్టిన ఆటోవాలాలు. ఈ క్రమంలో బస్ భవన్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో.. తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.