Home Page SliderNationalNewsNews AlertTrending Today

శబరిమల వెళ్లే యాత్రికులకు రూ.5 లక్షల ఉచిత బీమా

2024 సంవత్సరం నుండి శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుండి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సన్నిధానం, పంబ, అప్పచ్చిమేడు, నీలక్కల్ ఇతర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకూ ఏర్పాట్లు ఉంటాయని వివరించింది.