ఆవును రక్షిస్తూ నలుగురు మృతి
పశ్చిమబెంగాల్లో ఆవును రక్షించబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన సంఘటన విషాదం కలిగించింది. జల్పాయిగురి జిల్లాలో ఒక ఆవును కాపాడబోయి మిధున్ అనేవ్యక్తి అతని కుటుంబసభ్యులు నలుగురు మరణించారు. ఇంటిముందు నీటిలో పడిఉన్న కరెంటు వైరు ఆవుకు తగలడంతో దానికోసం మిధున్ అనే వ్యక్తి ప్రయత్నించారు. అతడికి కూడా షాక్ తగలడంతో అతడి తండ్రి పరేష్, తల్లి దీపాలి కూడా ప్రయత్నించారు. దీనితో వారందరికీ షాక్ తగిలింది. దీపాలి చేతిలో మనవడు ఉండడంతో పసివాడు సైతం కరెంట్ షాక్‌కు మృతిచెందాడు. దీనితో గ్రామంలో విషాదం నెలకొంది. జిల్లా మెజిస్ట్రేట్ చెప్పిన సమాచారం ప్రకారం వారి ఇంటివద్ద కరెంటు కనెక్షన్ అక్రమంగా ఉంది. దానితో హైఓల్టేజి విద్యుత్ ప్రవహించడంతో వారికి ప్రాణాపాయం కలిగింది. ఇలా అక్రమ కనెక్షన్లు తీసుకోవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి.