కేటిఆర్ మెడకు ఫార్ములా-ఈ రేస్ ఉచ్చు
దమ్ముంటే అరెస్ట్ చేయండి…దమ్ముంటే అరెస్ట్ చేయండి అని గత రెండు నెలల నుంచి మాజీ మంత్రి కేటిర్ రెచ్చగొడుతున్నా రేవంత్ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోలేదు.ఇప్పుడు సమయం ఆసన్నమైంది మిత్రమా …అన్నట్లుగా ఫార్ములా ఈ రేస్‌లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది.ఈ మేరకు గవర్నర్ నుంచి క్లియరెన్స్ కూడా లభించింది.ఈ ఉత్తర్వులు ఏసిబికి అందడం ఆలస్యం ఇక కేటిఆర్ పై కేసు నమోదైనట్లే అని అంతా భావిస్తున్నారు.ఇదే గనుక జరిగితే రేవంత్ సర్కార్…కేటిఆర్ ని జైలుకి పంపే దాకా నిద్రపోదు అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇప్పటికే మోహన్ బాబు,అల్లుఅర్జున్ లాంటి సెలబ్రిటీలను సైతం రేవంత్ వదల్లేదు.ఇక కేటిఆర్ వంతు వచ్చింది.ఏమీ అనని వాళ్లనే కటకటాల వెనక్కి పంపిస్తుంటే…నిత్యం దొంగ సన్నాసోడు అని విమర్శించే కేటిఆర్‌ని వదులుతారంటారా… అని పొలిటికల్ హబ్‌లో బాగా చర్చనడుస్తుంది.